Anthuleni Katha (1976) అంతులేని కథ

Movie : Anthuleni Katha (1976) అంతులేని కథ
Caste : Rajanikanth,Jayapradha,Kamal Hasan,Jayalakshmi,Sripriya,Baby Gowri,Master Ravi,Master Raju,Sudha,Jayavijaya,Pradeep kumar,Prasad Babu,Narayanarao,Hemasundar,Jayasri,Phani రజనీకాంత్,జయప్రద,కమల్ హాసన్,జయలక్ష్మి,శ్రీప్రియ,బేబీ గౌరీ,మాస్టర్ రవి,మాస్టర్ రాజు,జయవిజయ,ప్రదీప్ కుమార్,ప్రసాద్ బాబు,నారాయణరావు,హేమసుందర్,జయశ్రీ,ఫణి
Director : K Balachandar కె బాలచందర్
Music : M S Viswanadhan ఎం ఎస్ విశ్వనాథన్
Producer : Rama Aranganal రామ అరంగనల్
Release date : February 27 1976

01.Are Emiti Lokam Palugakula Lokam 01.అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం Singers: L R Easwari గాయకులు: ఎల్ ఆర్ ఈశ్వరి Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: M S Viswanadhan సంగీత దర్శకులు: ఎం ఎస్ విశ్వనాథన్

*** అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరోపిచ్చి మనాగినా తోసిపుచ్చి అనుభవించు తెగించీ మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరోపిచ్చి మనాగినా తోసిపుచ్చి అనుభవించు తెగించీ అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం గానుగెక్కి తిరిగితే కాశిదాక పోవునా పరులకొరకు పాటుబడితె పడుచుకోర్కె తీరునా గానుగెక్కి తిరిగితే కాశిదాక పోవునా పరులకొరకు పాటుబడితె పడుచుకోర్కె తీరునా చీమలను చూచైనా నేర్చుకోవే స్వార్థమూ వయసు కాస్త పోయినాక మనసున్నా వ్యర్థమూ ఫటాఫట్ అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరోపిచ్చి మనాగినా తోసిపుచ్చి అనుభవించు తెగించీ గీత గీచి ఆగమంటే సీత ఆగలేదుగా సీత అక్కడాగివుంటె రామకధే లేదుగా గీతలు నీతులుదేవుడివి కావులే చేతగాని వాళ్ళు తాము వేసుకున్న కాపులే ఫటాఫట్ అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం మరులు రేపు వగలు సెగలు మన్మధునీ లీలలు మన్మధుని లీలలకు ప్రేమికులు పావులూ మరులు రేపు వగలు సెగలు మన్మధునీ లీలలు మన్మధుని లీలలకు ప్రేమికులు పావులూ సొగసులన్నీ సృష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు పాచికలు పారినపుడె పరువానికి గెలుపులూ ఫటాఫట్ అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరోపిచ్చి మనాగినా తోసిపుచ్చి అనుభవించు తెగించీ అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం ***** Are emiti lokam palugaakula lokam - are emiti lokam palugaakula lokam Mamathannadi otti pichchi manasannadi maropichchi - manaa ginaa thosipuchchi anubhavinchu theginchee Mamathannadi otti pichchi manasannadi maropichchi - manaa ginaa thosipuchchi anubhavinchu theginchee Are emiti lokam palugaakula lokam Gaanugekki thirigithae kaasidaaka povunaa - parulakoraku paatubadithe paduchu korke theerunaa Gaanugekki thirigithae kaasidaaka povunaa - parulakoraku paatubadithe paduchu korke theerunaa Cheemalanu choochainaa naerchukovae swaarthamoo Vayasu kaastha poyinaaka manasunnaa vyarthamoo . . fhataa fhat Are emiti lokam palugaakula lokam Mamathannadi otti pichchi manasannadi maropichchi - manaa ginaa thosipuchchi anubhavinchu theginchee Geetha geechi aagamantae seetha aagalaedugaa - seetha akkadaagivunte raamakadhae laedugaa Geethalu neethulu daevudivi kaavulae - chaethagaani vaallu thaamu vaesukunna kaapulae . . fhataa fhat Are emiti lokam palugaakula lokam Marulu raepu vagalu segalu manmadhunee leelalu - manmadhuni leelalaku praemikulu paavuloo Marulu raepu vagalu segalu manmadhunee leelalu - manmadhuni leelalaku praemikulu paavuloo Sogasulannee srishti manaku ichchukunna paachikalu - paachikalu paarinapude paruvaaniki gelupuloo Fhataa fhat . . are aemiti lokam palugaakula lokam Mamathannadi otti pichchi manasannadi maropichchi - manaa ginaa thosipuchchi anubhavinchu theginchee Are emiti lokam palugaakula lokam ***********

02.Devude Ichadu Veedhi Okati Ika Oorela Sontha Illela O Chellela 02.దేవుడే యిచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత యిల్లేల ఓ చెల్లెలా Singers: Yesudasu గాయకులు: ఏసుదాసు Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: M S Viswanadhan సంగీత దర్శకులు: ఎం ఎస్ విశ్వనాథన్

*** దేవుడే యిచ్చాడు వీధి ఒకటి దేవుడే యిచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత యిల్లేల ఇక ఊరేల సొంత యిల్లేల ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం నన్నడిగి తలిదండ్రి కన్నారా ఆ ఆ ఆ నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా పాపం పుణ్యం నాదికాదే పోవే పిచ్చమ్మా నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్త వాదాలె ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్ధం దేవుడే యిచ్చాడు వీధి ఒకటి దేవుడే యిచ్చాడు వీధి ఒకటి శిలలేని గుడికేల నైవేద్యం ఈకలలోని సిరికేల ఈ సంబరం ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా తొలుత యిల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం తెలిసేట్లు చెప్పేది సిద్దాంతం అది తెలియక పోతేనే వేదాంతం మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా నిన్నునువ్వే తెలుసుకుంటే చాలును ఓ అమ్మా ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం వట్టి అహంకారం ఓ చెల్లెలా ఏల ఈ స్వార్ధం ఏది పరమార్థం దేవుడే యిచ్చాడు వీధి ఒకటి దేవుడే యిచ్చాడు వీధి ఒకటి ***** Daevudae ichchaadu veedhi okati - daevudae yichchaadu veedhi okati Ika ooraela sontha yillaela - ika ooraela sontha yillaela . . O chellelaa Aela ee swaartham aedi paramaartham - aela ee swaartham aedi paramaartham Nannadigi thalidandri kannaaraa aa aa aa - nannadigi thalidandri kannaaraa . . naa pillalae nannadigi puttaaraa Paapam punyam naadikaadae povae pichchammaa - naaru posi neeru posae naadhudu vaadammaa Aedi needi aedi naadi ee bhaedaalu uththa vaadaale - O chellelaa aela ee swaartham aedi paramaardham Daevudae yichchaadu veedhi okati - daevudae yichchaadu veedhi okati Silalaeni gudikaela naivaedyam - eekalaloni sirikaela ee sambaram Mulla chettuku chuttoo kanche enduku pichchammaa Kallu laeni kabodi chaethi deepam neevammaa . . tholutha yillu thudaku mannu Ee brathukentha daani viluventha . . O chellelaa . . aela ee swaartham aedi paramaartham Thelisaetlu cheppaedi siddaantham - adi theliyaka pothaenae vaedaantham Mannulona maanikyaanni vethikae verremmaa - ninnunuvvae thelusukuntae chaalunu O ammaa Aedi sathyam aedi nithyam ee mamakaaram vatti ahankaaram . . O chellelaa . . aela ee swaardham aedi paramaartham Daevudae yichchaadu veedhi okati daevudae yichchaadu veedhi okati ************

03.Kallalo Unnadedo Kannulake Thelusu 03.కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు Singers: S Janaki గాయకులు: ఎస్ జానకి Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: M S Viswanadhan సంగీత దర్శకులు: ఎం ఎస్ విశ్వనాథన్

*** కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు - కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు - రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసు కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు - రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు తానే మంటై వెలుగిచ్చు దీపం చెప్పదు తనలో చెలరేగు తాపం నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ - నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ రాలేరు ఎవరూ నాతో చేరీ నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసు వేసవిలోనూ వానలు రావా - కోవెల శిలకు జీవం రాదా జరిగేనాడే జరుగును అన్నీ- జరిగేనాడే జరుగును అన్నీ. . జరిగిననాడే తెలియును కొన్నీ నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసు కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు - రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసు ***** Kallalo unnadaedo kannulakae thelusu - kallalo unnadaedo kannulakae thelusu Raallalo unna neeru kallakelaa thelusu - raallalo unna neeru kallakelaa thelusu Naalo unna manasoo naaku gaaka inkevariki thelusu Kallalo unnadaedo kannulakae thelusu - raallalo unna neeru kallakelaa thelusu Thaanae mantai velugichchu deepam - cheppadu thanalo chelaraegu thaapam Nae vellu daaree O mulla daaree - nae vellu daaree O mulla daaree raalaeru evaroo naatho chaeree Naalo unna manasoo naaku gaaka inkevariki thelusu Vaesavilonoo vaanalu raavaa - kovela Silaku jeevam raadaa Jarigaenaadae jarugunu annee - jarigaenaadae jarugunu annee. . Jariginanaadae theliyunu konnee Naalo unna manasoo naaku gaaka imkevariki thelusu Kallalo unnadaedo kannulakae thelusu - raallalo unna neeru kallakelaa thelusu Naalo unna manasoo naaku gaaka inkevariki thelusu ***********

04.Ooguthundi Nee Inta Uyyala Ika Moodonela Padathavu Jo Jola 04.ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇక మూడో నెల పాడతావు జో జోల Singers: P Suseela గాయకులు: పి సుశీల Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: M S Viswanadhan సంగీత దర్శకులు: ఎం ఎస్ విశ్వనాథన్

*** ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇకమూడో నెల పాడుతావు జో జోల ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇకమూడో నెల పాడుతావు జో జోల అందాల బొమ్మవు కాబోతావమ్మవు అందాల బొమ్మవు కాబోతావమ్మవు ఇక ఆరు నెలలు మొగుడి ముఖం చూడవూ నువ్వు ఊగుతుంది - ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇక మూడో నెల పాడుతావు జో జోల నే కన్నాను కలలెన్నో ఆనాడు అవి నీ కళ్ళల్లో పండాయి ఈనాడు నే కన్నాను కలలెన్నో ఆనాడు అవి నీ కళ్ళల్లో పండాయి ఈనాడు వేశాను ఒక వలపు మొలకను అది నీ కడుపులో కాస్తుంది తొలి కాయను ఊగుతుంది - ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇక మూడో నెల పాడుతావు జో జోల అబ్బాయి పుట్టితే తండ్రి పేరు నీలా అమ్మాయి పుట్టితే నా పేరు అబ్బాయి పుట్టితే తండ్రి పేరు నీలా అమ్మాయి పుట్టితే నా పేరు ఎవరైనా తల్లికే మంచిపేరు వాళ్ళు ఎదిగి తెచ్చుకునేదే అసలు పేరు ఊగుతుంది - ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇకమూడో నెల పాడుతావు జో జోల కొండ మీద దేవునితో తన చెల్లెలు చేరి కొలువుంటే చూసినది అలుమేలు అనురాగం చాలునని అనుకున్నది తాను అల్లంత దూరాన ఆగినది ఆ దేవి దీవనె నీకున్నది ఆ ప్రభువు చలువ నీకు కాపున్నది. ఊగుతుంది - ఊగుతుంది నీ ఇంట ఉయ్యాల ఇకమూడో నెల పాడుతావు జో జోల ***** Ooguthundi nee inta uyyaala - ika moodo nela paaduthaavu jo jola Ooguthundi nee inta uyyaala - ika moodo nela paaduthaavu jo jola Andaala bommavu kaabothaavammavu - andaala bommavu kaabothaavammavu Ika aaru nelalu mogudi mukham choodavoo nuvvu Ooguthundi - ooguthundi nee inta uyyaala - ika moodo nela paaduthaavu jo jola Nae kannaanu kalalenno aanaadu - avi nee kallallo pandaayi eenaadu Nae kannaanu kalalenno aanaadu - avi nee kallallo pandaayi eenaadu Vaesaanu oka valapu molakanu - adi nee kadupulo kaasthundi tholi kaayanu Ooguthundi - ooguthundi nee inta uyyaala ika moodo nela paaduthaavu jo jola Abbaayi puttithae thandri paeru - neelaa ammaayi puttithae naa paeru Abbaayi puttithae thandri paeru - neelaa ammaayi puttithae naa paeru Evarainaa thallikae manchipaeru - vaallu edigi thechchukunaedae asalu paeru Ooguthundi - ooguthundi nee inta uyyaala ikamoodo nela paaduthaavu jo jola Konda meeda daevunitho thana chellelu chaeri koluvuntae choosinadi alumaelu Anuraagam chaalunani anukunnadi thaanu allantha dooraana aaginadi Aa daevi deevane neekunnadi aa prabhuvu chaluva neeku kaapunnadi Ooguthundi - ooguthundi nee inta uyyaala ikamoodo nela paaduthaavu jo jola **********

05.Thalikattu Subhavela Medalo Kalyana Mala 05.తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల Singers: S P Balasubrahmanyam గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం Lyrics: Athreya రచన: ఆత్రేయ Music Director: M S Viswanadhan సంగీత దర్శకులు: ఎం ఎస్ విశ్వనాథన్

*** తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ఓహోహో ఆహాహా ఊహూహూ ఎహేహే తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల వికట కవిని నేను వినండి ఒక కధ చెపుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా బావా రావా నన్నేలుకోవా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా డుండుం డుండుం మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా ఊరేగు దారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా సింగారి జాణల ముంగాలిమువ్వలు ఘుల్లున మోగెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించ వచ్చెనమ్మా కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్స్‌ చెప్పినమ్మా నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా మాంగల్యం తంతు నానే నమః బవజీవన హేతున కంఠే పద్మాబి సంజీవశరదం శదం నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా పట్టపుటేనుగుపచ్చగ నూరేళ్ళు వర్ధిల్లమనెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల చేయీ చేయిగ చిలుకా గోరింక శయ్యకు తరలిరమ్మా చెల్లెలి కోసం త్యాగము చేసిన చిలకమ్మ తొలగెనమ్మా తప్పుగ తలచిన అప్పటి గోరింక కిప్పుడు తెలిసెనమ్మా అది చిలుకే కాదని బావిలొ కప్పని జాలిగ తలచెనమ్మా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ఏనాడు ఏజంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ***** Thaalikattu subhavaela medalo kalyaana maala - ohoho aahaahaa oohoohoo ehaehae Thaalikattu subhavaela medalo kalyaana maala - aenaadu ae jantako raasi unnaadu vidhi eppudo Enaadu ejantako raasi unnaadu vidhi eppudo - thaalikattu subhavaela medalo kalyaana maala Vikata kavini naenu vinandi oka kadha cheputhaanu Kaakulu doorani kaaradavi - Andulo kaalam erugani maanokati Aa andaala maanulo aa adbhutha vanamlo Chakkani chilakalu akkaa chellelu pakkana gorinkalu - oka gorinkaku O chilakammaku oddika kudirenammaa Baavaa . . raavaa . . nannaelukovaa Thaalikattu subhavaela medalo kalyaana maala - aenaadu aejantako raasi unnaadu vidhi eppudo Enaadu ejantako raasi unnaadu vidhi eppudo Maelaalu thaalaalu mangalavaadyaalu minnanti mogenammaa . . dumdum dumdum Maelaalu thaalaalu mangalavaadyaalu minnanti mogenammaa Valapu vimaanaana thalapula vaegaana vachchaayi kaankalammaa Ooraegu daarula vayyaari bhaamalu veenalu meetirammaa Singaari jaanala mungaali muvvalu ghulluna mogenammaa Thaalikattu subhavaela medalo kalyaana maala - aenaadu ae jantako raasi unnaadu unnaadu vidhi eppudo Enaadu ejantako raasi unnaadu vidhi eppudo - thaalikattu subhavaela medalo kalyaana maala Gomaatha laegatho kondantha praematho deevincha vachchenammaa Convent pillala polina nemalulu greetings cheppinammaa Naalugu vaedaalu vallinchu harinaalu manthraalu chadivenammaa Maangalyam thanthu naanae mama jeevana haethuna - kantae padmaabi sanjeevasaradam sadam Naalugu vaedaalu vallinchu harinaalu manthraalu chadivenammaa Pattaputaenugu pachchaga nooraellu vardhilla manenammaa - thaalikattu subhavaela medalo kalyaana maala Chaeyee chaeyiga chilukaa gorinka Sayyaku tharalirammaa Chelleli kosam thyaagamu chaesina chilakamma tholagenammaa Thappuga thalachina appati gorinka kippudu thelisenammaa Adi chilukae kaadani baavilo kappani jaaliga thalachenammaa Thaalikattu subhavaela medalo kalyaana maala - aenaadu aejantako raasi unnaadu vidhi eppudo Thaalikattu subhavaela medalo kalyaana maala **********

One thought on “Anthuleni Katha (1976) అంతులేని కథ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>